Daku Maharaj: హైదరాబాద్ లో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..! 5 h ago
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కించిన "డాకు మహారాజ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. యూసఫ్ గూఢా లోని పోలీస్ గ్రౌండ్స్ లో జనవరి 10న సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్నట్లు మేకర్లు ప్రకటించారు. జనవరి 9న అనంతపురం లో జరగవలసిన ఈ ఈవెంట్ ను తిరుమల తొక్కిసలాట ఘటన కారణంగా రద్దు చేసినట్లు చిత్రబృందం తెలిపారు. ఇక ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 14న రిలీజ్ కానుంది.